కడిగిన ముత్యంలా బయటకొచ్చా: కవిత

ABN, Publish Date - Feb 27 , 2026 | 01:01 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిజమైందని హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిజమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 'లిక్కర్ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదని కోర్టు తేల్చింది. రాజకీయ కారణాలతోనే నాపై కేసు పెట్టారు. లిక్కర్ కేసును ఎవరూ నమ్మలేదు. నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నేను మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. న్యాయవ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. కేసు నుంచి తప్పించడం దేవుడిచ్చిన వరం. లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్ర. కేసును అడ్డం పెట్టుకుని నాపై రకరకాలుగా మాట్లాడారు. హింసించిన వారు ఇప్పుడేం చెబుతారు' అంటూ కవిత ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.745 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల!

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు భారీ ఊరట..

Updated at - Feb 27 , 2026 | 01:03 PM