చరిత్ర సృష్టించిన జియో ఐపీవో

ABN, Publish Date - Oct 23 , 2026 | 04:37 PM

జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీఓ ప్రపంచంలోనే కోటి దరఖాస్తుల మార్కును దాటిన తొలి పబ్లిక్ ఆఫర్‌గా రికార్డు సృష్టించింది. శుక్రవారం ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీఓ ప్రపంచంలోనే కోటి దరఖాస్తుల మార్కును దాటిన తొలి పబ్లిక్ ఆఫర్‌గా రికార్డు సృష్టించింది. శుక్రవారం ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలో వారీ ఎనర్జీస్ ఐపీఓ సుమారు 97 లక్షల దరఖాస్తులతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును జియో ప్లాట్‌ఫామ్స్ అధిగమించింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి సంస్థలు గతంలో భారత మార్కెట్‌లో సృష్టించిన రికార్డులను సైతం ఈ ఐపీఓ దాటింది. ఐపీఓ బిడ్డింగ్ ముగియడానికి ఇంకా ఐదు గంటల సమయం ఉండగానే దరఖాస్తుల సంఖ్య కోటి దాటడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులను ఆకర్షించిన తొలి పబ్లిక్ ఆఫర్‌గా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచిందని వర్గాలు తెలిపాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 23 , 2026 | 04:37 PM