హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవ సందడి

ABN, Publish Date - Sep 25 , 2026 | 09:40 AM

భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి గణనాథుడి విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి గణనాథుడి విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతిని టస్కర్‌పైకి చేర్చారు. మరికాసేపట్లో శోభాయాత్ర ప్రారంభంకానుంది. సచివాలయం సౌత్ ఈస్ట్ గేట్ ముందు నుంచి బడా గణపతి నిమజ్జనానికి రానున్నాడు. దీంతో బడా గణనాథుడు వెళ్లే మార్గాన్ని పోలీసులు బ్లాక్ చేశారు. ఇక వినాయక నిమజ్జనాలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ట్యాంక్‌‌బండ్‌కు చేరుకుంటున్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకలకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated at - Sep 25 , 2026 | 09:44 AM