బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలో భారీ వర్షం

ABN, Publish Date - Sep 10 , 2026 | 09:29 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల కొన్ని గంటల్లో పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు

దేశానికి ఆనుకొని ఉత్తర బంగాళ ఖాతంలో నేడు అల్పపీడను ఏర్పడినుంది. ఆ తర్వాత బలపడి ఉత్తర ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో ఒక మోస్తర వర్షాలు.. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాలలో మేఘావృత వాతావరణంతో పాటు ఈదురు గాళ్ళు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Sep 10 , 2026 | 09:29 AM