ఇంటి వద్దకే బస్సు.. సరికొత్త ప్రయోగానికి ఆర్టీసీ సన్నాహాలు
ABN, Publish Date - Aug 30 , 2026 | 11:56 AM
ప్రయాణికుల ఆదరణను చూరగొనటానికి విజయవాడ రీజియన్ ఆర్టీసీ అధికారులు కొత్త పంథాను అనుసరించనున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే తమ అగ్రశ్రేణి బస్సుల్లో 10 మందికిపైగా టికెట్లు బల్క్‌గా బుక్ చేసుకుంటే.. ఇంటి వద్దకు వచ్చి ఆ ప్రయాణికులను పికప్ చేసుకునే సదుపాయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రయాణికుల ఆదరణను చూరగొనటానికి విజయవాడ రీజియన్ ఆర్టీసీ అధికారులు కొత్త పంథాను అనుసరించనున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే తమ అగ్రశ్రేణి బస్సుల్లో 10 మందికిపైగా టికెట్లు బల్క్‌గా బుక్ చేసుకుంటే.. ఇంటి వద్దకు వచ్చి ఆ ప్రయాణికులను పికప్ చేసుకునే సదుపాయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ వంటి హైయ్యండ్ బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ బుక్ చేసుకున్నాక.. నిర్ణీత సమయం కంటే ముందే బస్టాండ్‌కు చేరుకోవాలి. కొన్ని ప్రాంతాల నుంచి లగేజీతో పాటు సకాలంలో బస్టాండ్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. దీనిని గుర్తించిన ఆర్టీసీ.. బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకుంటే ఆ ప్రయాణికుల ఇంటి వద్ద నుంచే వారిని పికప్ చేసుకునే సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Aug 30 , 2026 | 11:56 AM