ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిపై కల్తీ ఆరోపణలు..
ABN, Publish Date - Mar 07 , 2026 | 08:57 PM
ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిపై కల్తీ ఆరోపణలు వచ్చాయి. కల్తీకి సంబంధించిన ఆధారాలను తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి బయటపెట్టారు. విజయ డెయిరీపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిపై కల్తీ ఆరోపణలు వచ్చాయి. కల్తీకి సంబంధించిన ఆధారాలను తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి బయటపెట్టారు. విజయ డెయిరీపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ డెయిరీ ఉత్పత్తుల రైట్స్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడమే కల్తీకి కారణమని అమిత్ రెడ్డి తెలిపారు. ఏపీ పాల సేకరణతో సంబంధం లేకుండా గుజరాజ్‌లో నెయ్యి తయారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిపై తెలంగాణ డెయిరీ పరీక్షలు చేయించిందని.. నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉన్నట్లు గుర్తించినట్లు అమిత్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైద్యశాలలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం.. స్వయంగా చీపురు పట్టి ఊడ్చిన వైనం!
మహిళలకు నెలనెలా ఆర్థికసాయం.. టీవీకే అధినేత విజయ్ హామీ
Updated at - Mar 07 , 2026 | 08:58 PM