Share News

మహిళలకు నెలనెలా ఆర్థికసాయం.. టీవీకే అధినేత విజయ్ హామీ

ABN , Publish Date - Mar 07 , 2026 | 08:46 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తం అవుతున్న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మహిళల సంక్షేమానికే తమ ప్రాధాన్యమని అన్నారు. నూతన వధువులకు బంగారం, మహిళలకు నెల నెలా ఆర్థిక సాయం తదితర పథకాలను ప్రకటించారు.

మహిళలకు నెలనెలా ఆర్థికసాయం.. టీవీకే అధినేత విజయ్ హామీ
TVK Chief Vijay Poll Promises

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తాజాగా రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు ప్రకటించారు. 60 ఏళ్ల లోపు మహిళలకు నెల నెలా ఆర్థికసాయం, ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని అందిస్తామని అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూత్తుకుడి జిల్లాలో తాజాగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో విజయ్ మహిళల సంక్షేమం కోసం పథకాలను ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళల భద్రతే లక్ష్యంగా పాలన సాగుతుందని అన్నారు. ఈ దిశగా ప్రత్యేక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేస్తామని తెలిపారు (TVK Chief Vijay Poll Promises).

మహిళల భద్రతే టీవీకే ప్రధాన హామీ అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు మినహా 60 ఏళ్ల లోపు వారికి నెల నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు.


ఇక ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేలా అన్నపూర్ణ సూపర్ 6 పథకాన్ని కూడా ప్రకటించారు. ఇక వధువులకు 8 గ్రాముల బంగారం, ఒక పట్టుచీర అందిస్తామని చెప్పారు.

వెట్రి పయనం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా అందిస్తామని తెలిపారు. రేషన్ షాపులు, స్కూళ్లు, కాలేజీల్లో ఉచిత శానిటరీ ప్యాడ్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు.


ఇవీ చదవండి:

రాష్ట్రపతి ఈవెంట్‌కు మమత డుమ్మా.. ప్రోటాకాల్ నిబంధనల ఉల్లంఘన

విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్

Updated Date - Mar 07 , 2026 | 08:52 PM