14వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ABN, Publish Date - Mar 04 , 2026 | 09:16 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 14వ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
అమరావతి, మార్చి 4: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Session) 14వ రోజుకు చేరుకున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలతో సమావేశాలను ప్రారంభించారు. వీబీ రామ్ జీ జాబ్ కార్డ్స్, పీపీపీ మోడల్ క్రింద వైద్య కళాశాలలు, రెవెన్యూ శాఖ పెండింగ్ కేసులు, సింహాచలం పంచ గ్రామాలలో అనధికారిక నిర్మాణాలు, విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమలు, కోనసీమలో ఎంఎస్‌ఎంఈ పార్కులు, వరి రైతుల ఇబ్బందులు, గృహ నిర్మాణ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.
Updated at - Mar 04 , 2026 | 09:21 AM