యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్..
ABN, Publish Date - Feb 19 , 2026 | 09:45 PM
అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు అతడి అకౌంట్‌ను తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల లేఖ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించింది. తాజాగా ఖాతాను బ్యాన్ చేసింది.
'నా అన్వేషణ' పేరుతో పాపులర్ అయిన అన్వేష్.. ఇటీవల హిందూ దేవతలపై నోరు జారి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు అతడి అకౌంట్‌ను తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల లేఖ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించింది. తాజాగా ఖాతాను బ్యాన్ చేసింది. గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది. తాజాగా ఖాతా పూర్తిగా బ్యాన్ అయింది.
ఇవి చదవండి
మీ కళ్ల పవర్‌ను పరీక్షించుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి..
హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి
Updated at - Feb 19 , 2026 | 09:52 PM