Share News

మర్మాంగాలను పిసికి, గాజుతో కోసి

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:32 AM

వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్యచేసింది. మద్యం మత్తులో ఉండగా.. అతడి మర్మాంగాలను పిసికి, గాజుతో కోసి హతమార్చింది.

మర్మాంగాలను పిసికి, గాజుతో కోసి
mahaboobnagar

  • మర్మాంగాలను పిసికి, గాజుతో కోసి

  • వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

  • పాలమూరు జిల్లాలో ఘటననిందితురాలి అరెస్టు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్యచేసింది. మద్యం మత్తులో ఉండగా.. అతడి మర్మాంగాలను పిసికి, గాజుతో కోసి హతమార్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నవాబ్‌పేట మండలం తీగలపల్లి గ్రామానికి చెందిన పెద్దమోని శ్రీను (50)కు 24 ఏళ్ల క్రితం లక్ష్మమ్మతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. రెండేళ్లుగా మహబూబ్‌నగర్‌లోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటూ భార్యభర్తలు ఇద్దరూ కూలి పనులు చేసుకుంటున్నారు. తాగుడుకు బానిసైన లక్ష్మమ్మ ఒకరితో వివాహేతర సంబంధం కలిగి ఉంది. జల్సాలకు డబ్బులు సరిపోవడం లేదని మరికొంత మందితోనూ వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన భర్త శ్రీను భార్యతో తరచూ గొడవపడేవాడు. తన విలాసాలకు అడ్డుగా ఉన్న తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆమె అనుకుంది. ఈ క్రమంలోనే ఈనెల 19న రాత్రి భార్యాభర్తలు మద్యం సేవించారు. అప్పటికే భార్యపై అనుమానం ఉన్న భర్త ఆమెను నిలదీశాడు. మత్తులో ఉన్న భర్తను తోసేయడంతో అతడు కింద పడిపోయాడు. వెంటనే భార్య అతడి మర్మాంగాలను పిసికేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఇంట్లో ఉన్న అద్దం పగులకొట్టి ఓ ముక్కతో మర్మాంగాలను కోసేసింది. ఎడమ కన్నుపై గాజు ముక్కతో పొడవగా తీవ్రగాయాలతో అతడు అక్కడిక్కడే మృతిచెందాడు. అనంతరం లక్ష్మమ్మ అక్కడి నుంచి పరారైంది. కేసు నమోదు చేసిన టూటౌన్‌ పోలీసులు.. బుధవారం నిందితురాలిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

ఈ వార్తలను కూడా చదవండి..

టీవీ చానెళ్లు ప్రసార కార్యక్రమాల్లో నియమావళి పాటించాలి.. కేంద్రం అడ్వైజరీ

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ

Updated Date - Oct 22 , 2026 | 04:43 AM