Share News

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మృతి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 10:17 AM

బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిచెందారు. ఇవాళ(ఆదివారం) ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మృతి..
Peddi Sudarshan Reddy

వరంగల్: బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిచెందారు. ఇవాళ(ఆదివారం) ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. హనుమకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యారు సుదర్శన్ రెడ్డి. ఆయన పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అయితే, ఆ కాసేపటికే చికిత్సపొందుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తతో ఆయన నివాసం, ఆస్పత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు.

Updated Date - Jul 26 , 2026 | 10:24 AM