Share News

పదేళ్ల పింక్‌ పాలన కంటే.. వెయ్యిరోజుల ప్రజాపాలన భేష్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:23 AM

‘‘పదేళ్ల పింక్‌ పార్టీ పాలన కంటే వెయ్యిరోజుల ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్‌ పాలన భేష్‌. ఈ విషయాన్ని రాష్ట్రంలోని ఏ ఇంటికి వెళ్లినా, ఏ ఆడబిడ్డను, ఏ రైతును అడిగినా చెబుతారు’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు

పదేళ్ల పింక్‌ పాలన కంటే.. వెయ్యిరోజుల ప్రజాపాలన భేష్‌

  • ప్రజాభిమానాన్ని పొందిన సీఎం రేవంత్‌రెడ్డి: పొంగులేటి

కేసముద్రం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ‘‘పదేళ్ల పింక్‌ పార్టీ పాలన కంటే వెయ్యిరోజుల ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్‌ పాలన భేష్‌. ఈ విషయాన్ని రాష్ట్రంలోని ఏ ఇంటికి వెళ్లినా, ఏ ఆడబిడ్డను, ఏ రైతును అడిగినా చెబుతారు’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ‘‘వెయ్యిరోజుల ప్రభుత్వం ఏం చేసిందంటూ రేపో మాపో ఆ పింక్‌ కలరోళ్లు ఏదో కార్యక్రమం చేపడుతున్నారట! వాళ్లకు కళ్లుండి కనబడడంలేదా? చెవులుండి వినబడడంలేదా?’’ అని బీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. వెయ్యిరోజుల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాభిమానం పొందారని తెలిపారు.

Updated Date - Sep 01 , 2026 | 06:28 AM