వరి పండించడంలో.. కొనడంలో దేశంలోనే నంబర్ వన్ మనమే: మంత్రి ఉత్తమ్ కుమార్
ABN , Publish Date - Jun 28 , 2026 | 08:16 PM
వరి పండించడంలో.. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్‌వన్ అని అన్నారు పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడిన ఆయన, తెలంగాణ దేశంలోనే ధాన్యం కొనుగోళ్లలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
నల్లగొండ, జూన్ 28: వరి పండించడంలో.. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్‌వన్ అని అన్నారు పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని పండించి రైతుల నుంచి కొనుగోలు చేసిన రాష్ట్రంగా నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్లగొండలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ మొదటి స్థానంలో నిలవడం జిల్లాలోని రైతుల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
నల్లగొండలో ఓ నేత ధాన్యం కుప్పల వద్దకు వెళ్లి రాజకీయాలు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ, దిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాలని కోరారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే నల్లగొండతో పాటు పరిసర ప్రాంతాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై ‘మొసాద్’ దాడికి ప్లాన్? బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు!
మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..