Share News

సన్నిహితంగా ఉండటాన్ని చూశాడని హతమార్చారు

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:36 AM

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన 19ఏళ్ల యువతి, 14ఏళ్ల బాలుడు గత నెల 20న సన్నిహితంగా ఉండటాన్ని అదే గ్రామానికి చెందిన జిల్లెళ్ల రవి(15) చూశాడు.

సన్నిహితంగా ఉండటాన్ని చూశాడని హతమార్చారు
crime

  • బాలుడిపై ఓ యువతి, మరో బాలుడి దుశ్చర్య

  • కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు తాగించిన వైనం

  • ఖమ్మం జిల్లా చిన్నకోరుకొండిలో ఘటన

కల్లూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన 19ఏళ్ల యువతి, 14ఏళ్ల బాలుడు గత నెల 20న సన్నిహితంగా ఉండటాన్ని అదే గ్రామానికి చెందిన జిల్లెళ్ల రవి(15) చూశాడు. దాంతో తమ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి రవిని చంపేందుకు పురుగులమందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించారు. కూల్‌డ్రింక్‌ తాగాక నోటిలో పొక్కులు, చర్మంపై ఎలర్జీ రావడంతో వారిని ప్రశ్నించాడు. దాంతో వారు కూల్‌డ్రింక్‌లో విషం కలిపామని చెప్పడంతో భయపడిన బాలుడు వెంటనే విషయాన్ని తండ్రి(మూగ వ్యక్తి)కి, బంధువులకు చెప్పాడు. తొలుత ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయించగా పరిస్థితి విషమించడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఘటనపై రవి బంధువుల ఫిర్యాదుతో కూల్‌డ్రింక్‌ తాగించిన యువతిని, బాలుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Nov 10 , 2026 | 06:27 AM