Share News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో మరో ట్విస్ట్

ABN , Publish Date - Jul 20 , 2026 | 09:38 PM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో మరో ట్విస్ట్
Uday Krishna Reddy

హైదరాబాద్, జులై 20: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించలేదని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం అతిగా సేవించడం వల్లే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపారు. ఉదయ్ విషం తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఉదయ్‌ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కాగా, లైంగిక ఆరోపణల నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై హైదరాబాద్ నేషనల్ అకాడమీ చర్యలు తీసుకుంది. కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణా రెడ్డిని ఎన్‌పీఏ నుంచి అధికారులు పంపించేశారు.


ఇవి కూడా చదవండి

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్

మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్..

Updated Date - Jul 20 , 2026 | 09:51 PM