Share News

మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్..

ABN , Publish Date - Jul 20 , 2026 | 09:06 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండనున్నారు. వైద్యుల సూచన మేరకు పవన్ తన పర్యటనలను వాయిదా వేసుకున్నారు.

మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్..
Pawan Kalyan health

ఇంటర్‌నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండనున్నారు. వైద్యుల సూచన మేరకు పవన్ తన పర్యటనలను వాయిదా వేసుకున్నారు. కుడి భుజం శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి కొనసాగించాలని వైద్యులు సూచించారు. జన సమూహంలోకి వెళితే భుజానికి అసౌకర్యం కలిగే అవకాశముందని, గాయం తిరగబెట్టే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. వైద్యుల సూచనల మేరకు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే పవన్ విధులు నిర్వహించనున్నారు.


అధికారిక కార్యక్రమాలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. పిఠాపురం, పెదపెంకి, రాజమహేంద్రవరం పర్యటనలు వాయిదా వేసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయం నుంచే ప్రభుత్వ పనులు కొనసాగించనున్నారు. వైద్యుల సలహాలకు అనుగుణంగా విధులు నిర్వహించనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించనున్నారు.


ఇవి కూడా చదవండి

అప్పటివరకూ దీక్ష కొనసాగిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

దేవాదాయ శాఖలో పూర్తిస్థాయి డిజిటలీకరణే లక్ష్యం: కొండా సురేఖ

Updated Date - Jul 20 , 2026 | 09:32 PM