Share News

పోలీసుల టచ్‌లోకి గణపతి.. వారం, పది రోజుల్లో లొంగిపోయే ఛాన్స్

ABN , Publish Date - Mar 07 , 2026 | 09:34 PM

మావోయిస్టు అగ్రనేత గణపతి తెలంగాణ పోలీసుల టచ్‌లోకి వచ్చారు. వారం, పది రోజుల్లో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల టచ్‌లోకి గణపతి.. వారం, పది రోజుల్లో లొంగిపోయే ఛాన్స్
Ganapathi Maoist leader surrender

హైదరాబాద్, మార్చి 7: మావోయిస్టు అగ్రనేత గణపతి తెలంగాణ పోలీసుల టచ్‌లోకి వచ్చారు. వారం, పది రోజుల్లో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ బృందం నేపాల్, ఫిలిప్పీన్స్ వెళ్లనుంది. గణపతి పోలీసుల ముందు లొంగిపోతే రక్షణ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


లొంగిపోయిన 130 మావోయిస్టులు

శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చిన గంటల్లోనే గణపతి పోలీసుల టచ్‌లోకి వచ్చాడంటూ వార్తలు రావటం గమనార్హం.


ఇవి కూడా చదవండి

భార్యలు తమ భర్తల మాట వినాలి.. జెన్‌ జీ అబ్బాయిల అభిప్రాయం

కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం

Updated Date - Mar 07 , 2026 | 09:55 PM