తెలంగాణకు చేరిన పెద్దపులి
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:20 AM
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో రెండ్రోజులుగా తీవ్ర అలజడి సృష్టించిన పెద్దపులి తన దిశను మార్చుకుని తెలంగాణలోకి ప్రవేశించింది.
వేలేరుపాడు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో రెండ్రోజులుగా తీవ్ర అలజడి సృష్టించిన పెద్దపులి తన దిశను మార్చుకుని తెలంగాణలోకి ప్రవేశించింది. మండలంలోని తెల్లపల్లి అడవుల మీదుగా గురువారం తెలంగాణలోని అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు పెద్దపులికి అమర్చిన రేడియో టెలీ ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో పులి సంచరించే సమీప గ్రామాల ప్రజలను తెలంగాణ అధికారులు అప్రమత్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు