మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యం.. తొర్రూరులో హై టెన్షన్..

ABN, Publish Date - Feb 16 , 2026 | 11:59 AM

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించే ప్రయత్నంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 16: తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు గెలిచింది. అయితే ఎక్స్-ఆఫీషియో మెంబర్లతో (వరంగల్ కార్పొరేషన్ నుంచి కడియం కావ్య సహా) కాంగ్రెస్ బలం 9కి చేరింది. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మారే అవకాశం ఉండటంతో ఛైర్మన్ పీఠం కోసం రెండు పార్టీల మధ్య టెన్షన్ పెరిగింది.

Updated at - Feb 16 , 2026 | 12:04 PM