ఉద్రిక్తతకు దారి తీసిన బీఆర్ఎస్ నేతల ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’
ABN , Publish Date - Mar 19 , 2026 | 09:41 PM
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’ విసిరారు. బీఆర్ఎస్ నేతల ఛాలెంజ్ స్వీకరించి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎల్బీనగర్ చేరుకున్నారు.
హైదరాబాద్, మార్చి 19: ఎల్బీనగర్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’ విసిరారు. బీఆర్ఎస్ నేతల ఛాలెంజ్ స్వీకరించి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎల్బీనగర్ చేరుకున్నారు. ఎల్బీనగర్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర నాయకులు ఎల్బీనగర్ చౌరస్తా దగ్గరకు వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎల్బీనగర్ సర్కిల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసుకున్నారు.
ఇవి కూడా చదవండి
బాలికపై అత్యాచారం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే.?
జ్యోతిష్యుడి అరాచకాలు.. 58 మంది మహిళలకు మాయమాటలు చెప్పి..