Share News

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మేడ్చల్‌ వాసి పరిస్థితి విషమం

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:48 AM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డ తెలంగాణ యువకుడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం..   మేడ్చల్‌ వాసి పరిస్థితి విషమం
person

  • అమెరికాకెళ్లేందుకు అత్యవసర వీసాలు ఇప్పించండి

  • విదేశాంగ మంత్రి జైశంకర్‌కు బాధితుడి కుటుంబం విజ్ఞప్తి

  • సీఎం రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకోవాలని అభ్యర్థన

చాదర్‌ఘాట్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డ తెలంగాణ యువకుడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ నెల 3న మాసాచుసెట్స్‌లోని టింగ్స్‌బరోలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌ ప్రాంత రాజు కాలనీ వాసి సమద్‌ మహ్మద్‌ సుహైబ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన కుటుంబానికి సమాచారం అందింది. దీంతో బాధితుడి తండ్రి మహ్మద్‌ ఇస్మాయిల్‌.. ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్‌ ద్వారా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు వినతి పత్రం సమర్పించారు. సమద్‌కు అవసరమైన సాయమందించేందుకు అతని తండ్రి మహ్మద్‌ ఇస్మాయిల్‌, తల్లి రహీమా బేగం, బావ మహ్మద్‌ సమీ అమెరికా వెళ్లడానికి అత్యవసర వీసాలను జారీ చేయడంలో సహకరించాలని.. అందుకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ మధ్య తక్షణ సమన్వయం చేయాలని కోరారు. అందుకు అవసరమైన వైద్య పత్రాలు, అమెరికాలో సమద్‌ మిత్రుడి వివరాలను ఆ వినతి పత్రంతో జత చేశారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి కూడా జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి సాయం చేయాలని కోరారు. భారత్‌, అమెరికా రాయబార కార్యాలయాల అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి సమద్‌ తల్లిదండ్రులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి..

తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!

రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి

Updated Date - Nov 13 , 2026 | 05:48 AM