వారంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నోటిఫికేషన్!
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:07 AM
రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం భర్తీ చేయనున్న 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక నోటిఫికేషన్‌పై కసరత్తు నడుస్తోంది
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం భర్తీ చేయనున్న 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక నోటిఫికేషన్‌పై కసరత్తు నడుస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో చేపట్టనున్న ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ఆధారంగా భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వర్సిటీలు సిద్ధమయ్యాయి. నోటిఫికేషన్ విడుదలకు ముందు ఆయా వర్సిటీలు రోస్టర్ ఖరారు చేయాల్సి ఉంది. పాలకమండలి సమావేశంలో ఆమోదించిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడనుంది.