ఎయిడ్స్ నియంత్రణలో తెలంగాణ నెంబర్ వన్
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:46 AM
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
94 శాతం విజయంతో అగ్రస్థానం
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష(మాస్)’ కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 31 జిల్లాలు ‘సురక్షిత్’ హోదాను సాధించాయి. దీంతో ఎయిడ్స్/హెచ్‌ఐవీ నియంత్రణలో తెలంగాణ 94 శాతం విజయాన్ని నమోదు చేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయంపై మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్. చోంగ్తు రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేసిన అధికారులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలోని ‘సురక్షిత్’ హోదాను సాధించని మిగతా రెండు జిల్లాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టి పర్యవేక్షణ, సమన్వయం, వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్