Share News

తెలంగాణ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ అంతర్థానమైంది: డీజీపీ శివధర్ రెడ్డి

ABN , Publish Date - Mar 07 , 2026 | 08:58 PM

శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.

తెలంగాణ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ అంతర్థానమైంది: డీజీపీ శివధర్ రెడ్డి
Telangana DGP shivadhar reddy

హైదరాబాద్, మార్చి 7: నేటితో తెలంగాణ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ అంతర్థానమైంది డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తెలంగాణకు చెందిన 7 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని, ఆ ఏడు మంది తెలంగాణలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని వెల్లడించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.


ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ‘మావోయిస్టు అగ్రనేత గణపతి అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అనారోగ్య కారణాలతో అజ్ఞాతంలో ఉన్నట్టు సమాచారం ఉంది. లొంగిపోవాలని గణపతికి విజ్ఞప్తి చేస్తున్నాము. మావోయిస్టు అగ్ర నేతలు లొంగిపోవడంతో.. రాష్ట్ర కమిటీ నేతలు, కమిటీ సభ్యులు కూడా లొంగిపోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లొంగిపోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు’..


‘ప్రస్తుతం లొంగిపోయిన 130 మందిని వివిధ ప్రాంతాల నుండి తీసుకుని వచ్చాం. 130 మందిని ఒక చోట చేర్చడానికి మా డిపార్ట్‌మెంట్ తీవ్రంగా శ్రమించింది. లొంగిపోయిన మావోయిస్టులకు నిబంధనలకు అనుగుణంగా పునరావాసం కల్పిస్తాం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

మహిళలకు నెలనెలా ఆర్థికసాయం.. టీవీకే అధినేత విజయ్ హామీ

ఆరేళ్లుగా జట్టులో ఎన్నో ఒడిదొడుకులను అనుభవించా: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

Updated Date - Mar 07 , 2026 | 09:23 PM