Share News

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రమాదాలపై హైకోర్టు సీరియస్‌

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:02 AM

ఆదిలాబాద్‌ రిమ్స్‌ నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పైకప్పు కూలి న ఘటనలపై హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) నమోదు చేసింది

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రమాదాలపై హైకోర్టు సీరియస్‌
TG HIgh Court

  • న్యాయవాది లేఖను సుమోటో పిల్‌గా స్వీకరణ..

  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ రిమ్స్‌ నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పైకప్పు కూలి న ఘటనలపై హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) నమోదు చేసింది. ఈ ప్రమాదాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది నల్లపు మణిదీప్‌ రాసిన లేఖను పిల్‌గా పరిశీలించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ హైకోర్టుకు పంపారు. దీనిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శ్యామ్‌కోషీ, జస్టిస్‌ చలపతిరావులతో కూడిన ధర్మాసనం.. తదుపరి విచారణలోగా కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖలకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా ఆడిట్‌, ఐసీయూల ఆధునీకరణ, బాధితులకు పరిహారం ఇవ్వాలని న్యాయవాది మణిదీప్‌ లేఖలో కోరారు.

ఇవి కూడా చదవండి..

తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!

రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి

Updated Date - Nov 13 , 2026 | 05:23 AM