అప్రధాన శాఖకు సజ్జనార్
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:26 AM
ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను ప్రభుత్వం అప్రధాన శాఖకు బదిలీ చేసింది.
కొత్త కమిషనర్‌గా మహేశ్ భగవత్
అకున్ సబర్వాల్‌కు శాంతి భద్రతలు
ట్రాఫిక్ నిర్వహణకు స్టీఫెన్ రవీంద్ర
ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్
పౌర సరఫరాల శాఖకు నాగిరెడ్డి
రాష్ట్రంలో 19 మంది ఐపీఎస్ ల బదిలీ
కీలక స్థానాల్లో సర్కారు మార్పులు
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను ప్రభుత్వం అప్రధాన శాఖకు బదిలీ చేసింది. ఆయనను అగ్నిమాపక శాఖ డీజీగా నియమించింది. డీజీ మహేశ్ మురళీధర్ భగవత్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. సజ్జనార్ హైదరాబాద్ సీపీగా కేవలం 14 నెలలు మాత్రమే పని చేశారు. సాధారణంగా హైదరాబాద్ సీపీని రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలమే కొనసాగిస్తుంటారు. ఎవరూ ఊహించని విధంగా సజ్జనార్ బదిలీ పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవలి కాలంలో జరిగిన ఒకటి రెండు అంశాల్లో ప్రభుత్వం కొంత అసంతృప్తిగా ఉండడమే బదిలీకి కారణమనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవలే తెలంగాణకు తిరిగి వచ్చిన అకున్ సబర్వాల్ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. డీజీపీ తర్వాత అత్యంత కీలకమైన అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది.
ఊహించని విధంగా కీలక స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 19 మంది ఐపీఎ్‌సలను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన హైదరాబాద్ సీపీ సహా ఏసీబీ, సీఐడీ, జైళ్లు, మహిళా భద్రత, అగ్నిమాపక శాఖల వరకు కీలక బాధ్యతల్లో సీనియర్ ఐపీఎ్‌సలను మార్చింది. ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రను నియమించింది. ఒకరిద్దరు అధికారుల పనితీరు, వ్యవహార శైలిపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్న కారణంగానే కీలక స్థానాల్లో మార్పులు జరిగాయనే చర్చ జరుగుతోంది.
బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి
అధికారి పేరు కొత్త పోస్టింగ్
డా. సౌమ్య మిశ్రా (1994) మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా
స్వాతి లక్రా (1995) జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్
మహేశ్ మురళీధర్ భగవత్ (1995) హైదరాబాద్ పోలీస్ కమిషనర్
చారు సిన్హా (1996) డీజీ, ఏసీబీ, సీఐడీ (ఎఫ్‌ఏసీ)
డా. అనిల్ కుమార్ (1996) వీసీఅండ్‌ఎండీ, టీజీఎస్ ఆర్టీసీ
వి.సి. సజ్జనార్ (1996) డీజీ, ఫైర్ సర్వీసెస్,
డిజాస్టర్ రెస్పాన్స్, సివిల్ డిఫెన్స్
వై. నాగిరెడ్డి (1997) కమిషనర్, పౌర సరఫరాల శాఖ
సంజయ్ కుమార్ జైన్ (1997) అదనపు డీజీపీ, ట్రైనింగ్ (ఎఫ్‌ఏసీ)
విక్రమ్ సింగ్ మాన్ (1998) ఆపరేషన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్
ఎం. స్టీఫెన్ రవీంద్ర (1999) డైరెక్టర్, తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్,
రోడ్ అండ్ రైల్ సేఫ్ట్టీ బ్యూరో
అకున్ సబర్వాల్ (2001) అదనపు డీజీపీ, శాంతిభద్రతలు
ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (2004) డైరెక్టర్, ఏసీబీ
కార్తికేయ (2006) ఐజీపీ, మల్టీ జోన్--1
కె. రమేశ్ నాయుడు (2006) ఐజీపీ, రైల్వేస్
డి. జోయల్ డేవిస్ (2010) జాయింట్ డైరెక్టర్, రోడ్ సేఫ్టీ,
ట్రాఫిక్, టీజీ-టీమార్స్
జి. చందన దీప్తి (2012) డీఐజీ, జోన్-7, జోగులాంబ (ఎఫ్‌ఏసీ)
ఆర్. భాస్కరన్ (2012) డీఐజీ, ఇంటెలిజెన్స్ (ఎఫ్‌ఏసీ)
కె. నారాయణ నాయక్ (2009) డీఐజీ, జోన్--శ్రీశ్రీ, బాసర (ఎఫ్‌ఏసీ)
ఎల్.ఎస్. చౌహాన్ (2009) డీఐజీ, కో-ఆర్డినేషన్
శ్రీ బాలాదేవి (ఎస్‌పీఎస్) డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్),
టీజీ-టీఎంఏఆర్‌ఎస్
వి. అరవింద బాబు,ఐపీఎస్ (ఎస్‌పీఎస్) డీసీపీ,
ఎస్‌ఎంఅండ్ ఐటీ, హైదరాబాద్
ఇవి కూడా చదవండి..
మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు