Share News

జోగినిలకు ప్రత్యేక గుర్తింపు.. గుర్తింపు కార్డులు జారీ చేస్తాం!: మంత్రి పొన్నం

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:53 AM

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జోగినిలకు గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

జోగినిలకు ప్రత్యేక గుర్తింపు.. గుర్తింపు కార్డులు జారీ చేస్తాం!: మంత్రి పొన్నం
Ponnam Prabhakar

హైదరాబాద్, ఆగస్టు 3: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటనలు చేశారు. జోగినిలకు ప్రత్యేక గుర్తింపు, గుర్తింపు కార్డుల జారీతో పాటు భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ శుభదినమని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈసారి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొంత ఒత్తిడి ఏర్పడినా, దర్శనాలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు.


జోగినిలకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని వారు కోరిన విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో జోగినిలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, వారికి గుర్తింపు కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో వారిని కో-ఆప్షన్ సభ్యులుగా తీసుకునే దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అమ్మవారికి సేవ చేసే వారికి మూడు శాఖల సమన్వయంతో లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తామని, జోగినిలకు అధికారిక గుర్తింపు కల్పించే అంశంపై సంబంధిత మంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్ నియామకం

కోర్టుల్లో విచారణకు నోచని ‘పరీక్షల్లో అక్రమాల’ కేసులు..158

Updated Date - Aug 03 , 2026 | 01:17 PM