Share News

‘ఈ-క్యాబినెట్‌’ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం

ABN , Publish Date - Jun 18 , 2026 | 01:23 PM

రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇక నుంచి ‘ఈ-క్యాబినెట్‌’ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిజిటల్ కేబినెట్‌ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

‘ఈ-క్యాబినెట్‌’ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం
Telangana Digital Cabinet

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇక నుంచి ‘ఈ-క్యాబినెట్‌’ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిజిటల్ కేబినెట్‌ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ట్యాబ్‌‌లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ కేబినెట్ అమలు తీరును పరిశీలించారు.


ఈ క్యాబినెట్‌ విధానంతో మంత్రివర్గ ఎజెండాలు, నోట్‌లు, నిర్ణయాలు, ఫైళ్లు పూర్తిగా డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంటాయి. వాటిని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ట్యాబ్‌, కంప్యూటర్‌ ద్వారా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో క్యాబినెట్‌ నిర్ణయాలు, ఎజెండాలను ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా చూసుకోవచ్చు. ఇందుకోసం మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేక పాస్‌వర్డ్‌, లాగిన్‌ ఐడీని అందిస్తారు.


దీంతో పత్రాల భద్రత, గోప్యత మరింత పెరుగుతుంది. ‘ఈ-క్యాబినెట్‌’ విధానం కోసం ప్రభుత్వం ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను వినియోగించనుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ కోసం దాదాపు రూ.2కోట్ల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర ఐటీ శాఖ అంచనావేసింది. ఇందులో భాగంగానే ఎన్‌ఐసీకి మొదటి విడతగా రూ.20లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

టీఎంసీకి కోల్‌కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ

అమెరికాలో భారతీయ యువకుడి మృతి.. తల్లిని కాపాడే ప్రయత్నంలో..

Updated Date - Jun 18 , 2026 | 01:34 PM