Share News

అమెరికాలో భారతీయ యువకుడి మృతి.. తల్లిని కాపాడే ప్రయత్నంలో..

ABN , Publish Date - Jun 18 , 2026 | 01:05 PM

అమెరికాలో పర్యటించడానికి వెళ్లిన ఓ భారతీయ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. న్యూయార్క్ సిటీలో చోటుచేసుకున్న గుర్రపు బగ్గీ ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

అమెరికాలో భారతీయ యువకుడి మృతి.. తల్లిని కాపాడే ప్రయత్నంలో..
New York Central Park

న్యూయార్క్, జూన్ 18: అమెరికాలో పర్యటించడానికి వెళ్లిన ఓ భారతీయ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. న్యూయార్క్ సిటీలో చోటుచేసుకున్న గుర్రపు బగ్గీ ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్రపు బగ్గీ పైనుంచి కిందపడ్డ యువకుడు తీవ్రగాయాలతో కన్నుమూశాడు. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భారత దేశానికి చెందిన 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్ ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. బుధవారం రోమాంచ్ ఫ్యామిలీ న్యూయార్క్ సిటీలో పర్యటించింది.


మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సెంట్రల్ పార్కులో మహాజన్ కుటుంబం గుర్రపు బగ్గీ ఎక్కింది. గుర్రపు బగ్గీలో కూర్చున్న తర్వాత ఫ్యామిలీ మొత్తం ఫొటో తీసుకోవాలని అనుకుంది. దీంతో గుర్రపు బగ్గీ డ్రైవర్ ఫ్యామిలీ ఫొటో తీయడానికి కిందకు దిగాడు. గుర్రానికి ఏమైందో ఏమో తెలీదు కానీ, డ్రైవర్ కిందకు దిగగానే ముందుకు పరుగులు పెట్టింది. గుర్రం పరుగులు తీస్తున్న వేగానికి బగ్గీ అటు, ఇటు ఊగటం మొదలెట్టింది. లోపల ఉన్న మహాజన్ కుటుంబసభ్యులు భయంతో అరవసాగారు. ఈ నేపథ్యంలోనే రోమాంచ్ మహాజన్ తల్లి గుర్రపు బగ్గీ నుంచి కిందపడిపోయింది.


తల్లిని కాపాడటం కోసం రోమాంచ్ మహాజన్ వెంటనే కిందకు దూకాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబసభ్యులు అతడిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. రోమాంచ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా గుర్రపు బగ్గీ డ్రైవర్లు కిందకు దిగకూడదు. ఆ గుర్రం పార్కులోకి వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే అయింది. మహాజన్ ఫ్యామిలీ ఫొటో తీయడానికి డ్రైవర్ కిందకు దిగాడు. డ్రైవర్లు అలా చేయకూడదు. గుర్రం భయంతో పరుగులు పెట్టింది. అందులోని జనం కిందపడిపోయారు’ అని చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి

ఉజ్బెకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన కొలంబియా

తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు

Updated Date - Jun 18 , 2026 | 01:06 PM