పెద్దికి పర్సెంటేజ్ కావాల్సిందే.. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం
ABN , Publish Date - May 23 , 2026 | 04:26 PM
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ది సినిమా విడుదల చేయాలంటే తమకు పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఇకపై ఏ సినిమా అయినా పర్సంటేజ్ కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది.
హైదరాబాద్, మే 23: తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ది సినిమా విడుదల చేయాలంటే తమకు పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఇకపై ఏ సినిమా అయినా పర్సంటేజ్ కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. శనివారం తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో రెండు, మూడు సార్లు చర్చలు జరిగాయి. హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో.. రెండు నెలల్లో మా సమస్యను పరిష్కరిస్తామని అన్నారు’..
‘కానీ, సంవత్సరం గడిచిపోయింది. పెద్ది సినిమాకు మాకు పర్సంటేజ్ కావాల్సిందే. మమ్మల్ని నిర్మాతలు రెచ్చగొడుతున్నారు. మొదట మూడు వారాలు అన్నారు.. ఇప్పుడు ఆరు వారాలు అంటున్నారు. పర్సెంటేజ్ సిస్టమ్ అయితేనే సినిమాలు ఆడిస్తాము. 120 మంది థియేటర్స్ ఓనర్లు దీనస్థితిలో ఉన్నారు. పర్సంటేజ్ సిస్టంను కావాలనే నిర్మాతలు లేట్ చేస్తున్నారు. మాకు పర్సెంటేజ్ విధానం కావాల్సిందే. అది ఎంత ఇస్తారో చెప్పండి. 10,15 ఏళ్ల కింద థియేటర్స్‌కి మంచి రెవెన్యూ ఉండేది. ఇప్పుడు ఎగ్జిబిటర్స్‌కి రెవెన్యూ రావడం లేదు. కానీ, నిర్మాతలకు 14 రకాలుగా ఆదాయం వస్తోంది’..
‘పర్సంటేజ్ విధానం కొత్త విషయం కాదు. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఉంది. కాబట్టి కూర్చుని పర్సంటేజ్‌ను తేల్చండి. అన్ని సినిమాల రిలీజ్ సాఫీగా జరుగుతుంది. మీటింగ్‌లో కూడా పర్సంటేజ్‌కు సైన్ చేస్తేనే పెద్ది రిలీజ్‌కు ఒప్పుకుంటామని చెప్పాము. సబ్ కమిటీలో మెంబర్స్‌గా ఉండి.. మాకు కావలసిన పర్సంటేజ్‌ను సాధించుకుంటాం. మెగాస్టార్ చిరంజీవి పిలిస్తే వెళతాం. పెద్దమనిషికి మా బాధలు చెప్పుకుంటాం. పర్సంటేజ్ సిస్టమే ఉండాలి. రెంటల్ మాట వద్దు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
కాక్‌రోచ్ జనతా పార్టీ వెబ్‌సైట్ తొలగింపు.. కేంద్రంపై అభిజీత్ దీప్కే మండిపాటు..
తిరిగొచ్చిన సాల్ట్.. వెంకటేశ్ అయ్యర్‌ను కాదు అతడిని తప్పించండి: సెహ్వాగ్