Share News

పుదుచ్చేరి, కేరళలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - Apr 01 , 2026 | 09:43 PM

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆలయ బుధవారం పుద్దుచ్చేరి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

పుదుచ్చేరి, కేరళలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం
Bhatti Vikramarka campaign

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆలయ బుధవారం పుద్దుచ్చేరి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం, భట్టి విక్రమార్క గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు పుదుచ్చేరిలో విస్తృతంగా పర్యటించనున్నారు. అక్కడ జరగనున్న ఎన్నికల ప్రచార సభల్లో, రోడ్ షోలలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపున్నారు.


పుదుచ్చేరి పర్యటన ముగించుకుని, ఈ నెల 4వ తేదీన కేరళా రాష్ట్రాలనికి వెళ్లనున్నారు. కేరళలోని పతనంతిట్ట నియోజకవర్గంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో భట్టి పాల్గొంటారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల ప్రజలకు వివరిస్తూ ప్రచార జోరు పెంచనున్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించి, తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

ఒంటిమిట్ట ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. స్పందించిన సిబ్బంది

Updated Date - Apr 01 , 2026 | 09:43 PM