ఎల్‌నినో నుంచి రాష్ట్రాన్ని కాపాడు దేవుడా
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:40 AM
ఎల్‌నినో విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడు దేవుడా’ అంటూ డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క భగవంతుడిని కోరుకున్నారు
ఎల్‌నినో నుంచి రాష్ట్రాన్ని కాపాడు దేవుడా
చీటీపై రాసి జమ్మిచెట్టుకు కట్టిన డిప్యూటీ సీఎం భట్టి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
‘ఎల్‌నినో విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడు దేవుడా’ అంటూ డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క భగవంతుడిని కోరుకున్నారు. మంగళవారం రాత్రి ఖమ్మం జిల్లా మధిర బంజారా కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన దసరా వేడుకలకు హాజరైన ఆయన శమీ పూజలో పాల్గొన్నారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా పూజలు చేసిన భట్టి తన కోర్కెను ఓ చీటీపై రాసి జమ్మిచెట్టుకు కట్టారు. వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలోనూ పూజా కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ అమ్మవారిని వేడుకున్నారు. దసరా రోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లిలో శ్రీలక్ష్మీ అనంతపద్మనాభస్వామి నవరాత్రి ఉత్సవాలకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనమ్మ దేవాలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.