Share News

రాష్ట్ర పురోగతిలో మీ కృషి అభినందనీయం

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:09 AM

సమాజ అభ్యున్నతి, రాష్ట్ర పురోగతి కోసం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు.

రాష్ట్ర పురోగతిలో మీ కృషి అభినందనీయం

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ ఆర్కేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 21 : సమాజ అభ్యున్నతి, రాష్ట్ర పురోగతి కోసం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పుట్టినరోజు(జూన్‌ 20) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి ఓ లేఖ పంపారు. ‘‘ మీడియా రంగంలో నిమగ్నమై అనునిత్యం నిబద్ధతతో సేవలందిస్తూ ప్రజాసమస్యలను వెలుగు తీసుకురావడంలో, సమాజ అభ్యున్నతి, రాష్ట్ర పురోగతికి మీవంతు విశిష్ట కృషి అందించడంలో మీరు నిరంతరం కార్యోన్ముఖులై ఉండడం అభినందనీయం. ప్రజాజీవనం మరింత మెరుగైన దిశగా సాగేందుకు మీరు చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని, భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 04:09 AM