కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:59 AM
పసిడి పంటలతో పాలమూరు జిల్లా విరాజిల్లాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. పాలమూరు జిల్లాకు మంచి రోజులు రానున్నాయని చెప్పారు.
జడ్చర్ల/నాగర్‌కర్నూల్/వంగూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పసిడి పంటలతో పాలమూరు జిల్లా విరాజిల్లాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. పాలమూరు జిల్లాకు మంచి రోజులు రానున్నాయని చెప్పారు. మంగళవారం ఆయన జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. రావణదహణం కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్, ఎంపీ మల్లురవి పాల్గొన్నారు. అంతకు ముందు విజయదశమి వేడుకలను సీఎం తన స్వగ్రామం నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరుపుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో హెలికాప్టర్‌లో కొండారెడ్డిపల్లికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. సాయంత్రం 6:30 గంటలకు షమీ వృక్షానికి ప్రత్యే క పూజలు నిర్వహించేందుకు కాలినడకన వెళా ్లరు. వేలమంది కొండారెడ్డిపల్లికి చేరుకోవడంతో గ్రామంలో కిక్కిరిసిన వాతావరణం కన్పించింది. తన సోదరులు తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డి, అల్లుడు సత్యనారాయణరెడ్డి, మనువడు రియాన్ష్‌తో కలిసి షమీ వృక్షానికి పూజ నిర్వహించిన అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వావి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. వేదిక వద్ద గ్రామస్థులు, తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలను ప్రత్యేకంగా కలుసుకున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి..
టీవీ చానెళ్లు ప్రసార కార్యక్రమాల్లో నియమావళి పాటించాలి.. కేంద్రం అడ్వైజరీ
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ