Share News

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - May 23 , 2026 | 09:49 PM

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Telangana Cabinet decisions

హైదరాబాద్, మే 23: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు కేటాయించనుంది. అసంపూర్తి ఇందిరమ్మ ఇళ్ల పూర్తి పనులకు నిధులను కేటాయించింది. గోడల దశలో నిలిచిన ఇళ్లకు రూ.3 లక్షల సాయం.. శ్లాబు దశలో ఆగిన ఇళ్లకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించనుంది.


హైదరాబాద్ పరిధిలో లక్ష ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. గుడిసెల్లో ఉన్న 15 వేల కుటుంబాలకు వెంటనే ఇళ్లు మంజూరు చేయనుంది. గోదావరి పుష్కరాల పనులకు రూ.1000 కోట్లు కేటాయింపునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.587 కోట్లు కేటాయించింది.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..

Updated Date - May 23 , 2026 | 09:52 PM