Share News

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..

ABN , Publish Date - Sep 18 , 2026 | 08:52 PM

ఎనిమిది రోజుల పాటు వాడీవేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 51 గంటల 52 నిమిషాల పాటు కొనసాగిన సభలో ప్రశ్నలు, చర్చలు, సభ్యుల ప్రసంగాలు, ప్రభుత్వ ప్రకటనలు, బిల్లుల ఆమోదంతో కీలక అంశాలు చర్చకు వచ్చాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..
Telangana Assembly Session 2026

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఎనిమిది రోజుల పాటు వాడీవేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 51 గంటల 52 నిమిషాల పాటు కొనసాగిన సభలో ప్రశ్నలు, చర్చలు, సభ్యుల ప్రసంగాలు, ప్రభుత్వ ప్రకటనలు, బిల్లుల ఆమోదంతో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. మూడు ప్రభుత్వ తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. అలాగే సభ ముందుకు వచ్చిన నాలుగు బిల్లులకూ ఆమోదం లభించింది.


సెప్టెంబర్ 7న ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ హామీల అమలును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులు, నినాదాలు ఉన్న నల్ల టీషర్టులతో అసెంబ్లీకి చేరుకున్నారు. వారిని పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

సమావేశాల్లో నాలుగు స్వల్పకాలిక చర్చలు కూడా జరిగాయి. ఇక 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం పార్టీల బలాబలాల విషయానికి వస్తే.. కాంగ్రెస్‌కు 66 మంది, బీఆర్ఎస్‌కు 37 మంది, బీజేపీకి 8 మంది, ఎంఐఎంకు 7 మంది, సీపీఐకి ఒక సభ్యుడు ఉన్నారు.


Also Read:

ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్‌పాల్ సింగ్

పట్టభద్రుల పోరుకు కసరత్తు!

పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..

Updated Date - Sep 18 , 2026 | 09:18 PM