Share News

అనుమానం పెనుభూతమై.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:32 PM

అనుమానం దారుణానికి దారి తీసింది. ప్రియురాలిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు..

అనుమానం పెనుభూతమై.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..
Mahabubabad news

హైదరాబాద్, ఫిబ్రవరి 17: మహబూబాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రియురాలిపై అనుమానంతో ప్రియుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఓ జంట ప్రగతి నగర్‌లో గత కొంత కాలం నుంచి సహజీవనం చేస్తోంది. అనుమానం వీరి బంధంలో చిచ్చుపెట్టింది. ప్రియురాలు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని ప్రియుడు తట్టుకోలేకపోయాడు.


ప్రియురాలిపై పగ పెంచుకున్నాడు. మంగళవారం ఈ విషయమై ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ సందర్భంగా ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత తనపై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

ఐర్లాండ్‌ vs జింబాబ్వే: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సూపర్ 8కి జింబాబ్వే

ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో మార్పు.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

Updated Date - Feb 17 , 2026 | 09:04 PM