Share News

సమ్మర్ ఎఫెక్ట్.. రోజు రోజుకు పెరుగుతున్న బీర్ సేల్స్..

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:12 PM

రాష్ట్రంలో బీర్ సేల్స్ రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. మార్చి 2వ తేదీ ఒక్క రోజే 40 శాతం మేర బీర్ సేల్స్ పెరిగాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీర్ సేల్స్ భారీగా ఉండే అవకాశం ఉంది.

సమ్మర్ ఎఫెక్ట్.. రోజు రోజుకు పెరుగుతున్న బీర్ సేల్స్..
Beer sales increase

హైదరాబాద్, మార్చి 4: ఎండాకాలం మొదలైంది. భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. 10 తర్వాత బయట తిరగాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలు దంచికొడుతుండటంతో జనాలు చల్లని పానియాల వైపు మొగ్గు చూపుతున్నారు. మద్యం ప్రియులు ఎండల కారణంగా బీర్‌లను తెగ తాగేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీర్ సేల్స్ రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. మార్చి 2వ తేదీ ఒక్క రోజే 40 శాతం మేర బీర్ సేల్స్ పెరిగాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీర్ సేల్స్ భారీగా ఉండే అవకాశం ఉంది.


ఫిబ్రవరి నెల 28 రోజులకు గానూ మొత్తం 3,210 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఫిబ్రవరి 28వ తేదీ ఒక్క రోజే 3 లక్షల 28 వేల కేసుల బీర్.. 2 లక్షల 85 కేసుల లిక్కర్ (హార్డ్ ) అమ్మకాలు జరిగాయి. తాజాగా, సంగారెడ్డిలోని బీర్ కంపెనీలను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. బీర్ కొరత రాకుండా చర్యలకు ఉపక్రమించారు. సమ్మర్‌లో బీర్‌ల ఫ్యాక్టరీలకు నీటి సరఫరా ఆగకుండా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి

కొండా మురళీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

పొలంలో జింక ప్రత్యక్షం

Updated Date - Mar 04 , 2026 | 01:18 PM