Share News

మద్యం మత్తులో రాజ్‌తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య హల్‌చల్‌

ABN , Publish Date - Mar 25 , 2026 | 09:34 PM

సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హల్ చల్ చేశారు. బైకుపై వెళుతున్న ఓ వ్యక్తిని ఆమె కారుతో ఢీకొట్టారు. గ్రామస్తులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మద్యం మత్తులో రాజ్‌తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య హల్‌చల్‌
Lavanya drunk driving

హైదరాబాద్, మార్చి 25: సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హల్ చల్ చేశారు. బైకుపై వెళుతున్న ఓ వ్యక్తిని ఆమె కారుతో ఢీకొట్టారు. అక్కడినుంచి ఆగకుండా పోయేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బుధవారం మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని లావణ్య కారుతో ఢీ కొట్టారు. కారు ఆపకుండా అక్కడినుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో మల్లెపల్లి గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు.


సారీ చెప్పే వరకు అక్కడినుంచి కదలనివ్వమని తేల్చి చెప్పారు. లావణ్య వారితో గొడవకు దిగారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతోనూ లావణ్య కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. లావణ్యపై కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. కారులో మద్యం బాటిల్లు చూశామని గ్రామస్తులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉంది, పాక్‌లా దళారీ దేశం కాదు: జైశంకర్

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

Updated Date - Mar 25 , 2026 | 09:38 PM