గద్దె పైకి చేరుకున్న సమ్మక్క తల్లి..
ABN , Publish Date - Jan 29 , 2026 | 08:46 PM
సమ్మక్క తల్లి గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గద్దెపైకి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా సమ్మక్కకు స్వాగతం పలికారు.
ములుగు, జనవరి 29: మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. వనదేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. నిన్న (బుధవారం) సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజు గద్దెలపైకి చేరుకున్నారు. గద్దెలపైకి వనదేవతల ఆగమనంతో మేడారం జాతరలో తొలిఘట్టం పూర్తయింది. కుంకుమ భరిణ రూపంలో సారలమ్మ గద్దెలపైకి చేరుకున్నారు. గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకున్నారు.
జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా సమ్మక్కకు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్.. జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారిక స్వాగతం పలికారు. మూడంచెల భద్రత నడుమ సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి..
కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..
సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మమునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు