Share News

వ్యాపారవేత్త అశోక్‌ వేములపల్లి కుమారుడు రోహిత్‌ వివాహం

ABN , Publish Date - Aug 31 , 2026 | 04:27 AM

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అశోక్‌ వేములపల్లి కుమారుడు రోహిత్‌ వివాహం చెన్నైకి చెందిన అక్కినేని రవిశంకర్‌ ప్రసాద్‌ కుమార్తె అంజలితో ఆదివారం ఘనంగా జరిగింది.

వ్యాపారవేత్త అశోక్‌ వేములపల్లి కుమారుడు రోహిత్‌ వివాహం

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అశోక్‌ వేములపల్లి కుమారుడు రోహిత్‌ వివాహం చెన్నైకి చెందిన అక్కినేని రవిశంకర్‌ ప్రసాద్‌ కుమార్తె అంజలితో ఆదివారం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ గ్రామ పరిధిలోని ది వెన్యూ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ సినీనటులు జగపతిబాబు, మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

- మొయినాబాద్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Aug 31 , 2026 | 04:34 AM