ఎస్‌ఎల్‌బీసీ, ప్రాణహిత పూర్తిచేసి తీరుతాం
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:40 AM
కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ, ప్రాణహిత ప్రాజెక్టులను పూర్తిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినప్పుడే, రాహుల్‌గాంధీని ప్రధాని చేసినప్పుడే వైఎస్ ఆశయాలను నెరవేర్చినట్టు అవుతుందని పేర్కొన్నారు.
మోదీని గద్దె దించి రాహుల్‌ను ప్రధాని చేయాలి..
అప్పుడే వైఎస్ ఆశయాలు నెరవేరినట్టు: రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ, ప్రాణహిత ప్రాజెక్టులను పూర్తిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినప్పుడే, రాహుల్‌గాంధీని ప్రధాని చేసినప్పుడే వైఎస్ ఆశయాలను నెరవేర్చినట్టు అవుతుందని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లపాటు కాంగ్రెస్ నేతలుకష్టపడి పనిచేయాలని.. మోదీని గద్దె దింపి రాహుల్‌ను ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేవీపీ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో బుధవారం స్వామినాథన్ ఫౌండేషన్‌కు ప్రతిష్ఠాత్మకమైన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవార్డును అందజేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. నెహ్రూ హయాం నుంచీ కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం గురించే ఆలోచించిందని.. భారీ ప్రాజెక్టులు కట్టినది, రైతుల పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చేసినది, దళితులకు, ఆదివాసులకు భూములు ఇచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని చెప్పారు. రేషన్‌షాపుల ద్వారా ప్రతి పేదవాడికి అవసరమైన ఆహార ధాన్యాలు అందించేందుకు వీలు కల్పించినదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణలో కోట్లాది మందికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులు, సామాన్య ప్రజల కోసం పాటుపడి రెండు సార్లు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు.
ప్రధాని మోదీ విదేశాల్లో నేతలను కౌగిలించుకోవడానికి పరిమితమైతే.. కాంగ్రెస్ పేదలకు అవకాశాలు కల్పించడంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. ఇక గుల్బర్గాలో తాను, వైఎస్ విద్యార్థులుగా ఉన్నప్పుడు మల్లికార్జునఖర్గే తమకు గార్డియన్‌గా వ్యవహరించారని కేవీపీ రామచందర్‌రావు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశ ప్రజలను సమైక్యంగా ఉంచగలదని.. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేయగలదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ హయాంలో 156 కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 74 మంది తొలిసారి ఎన్నికైనవారేనని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో వచ్చిన వ్యవసాయ విప్లవంపై తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్య రచించిన పుస్తకాన్ని జైరాంరమేశ్ ఆవిష్కరించారు.
ఇవి కూాడా చదవండి
నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం: తిలక్ వర్మ