సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయను.. నా దృష్టి అంతా అభివృద్ధి పైనే: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - May 30 , 2026 | 07:57 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలపై, ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వివాదాలు, సెంటిమెంట్‌తో రాజకీయం చేయడం తనకు ఇష్టం లేదని, తన దృష్టి అంతా అభివృద్ధి పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, మే 30: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలపై, ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వివాదాలను, సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు అలాంటి రాజకీయాలు చేయడం ఇష్టం లేదని, తన దృష్టి మొత్తం కేవలం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును, ఆ పార్టీ నాయకుల ద్వంద్వ నీతిని ఎండగట్టారు.
గతంలో ఖమ్మంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని అప్పటి బీఆర్‌ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే హైదరాబాద్‌లో కమ్మ సంఘానికి కేసీఆర్ ప్రభుత్వం పది ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయించలేదా అని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరపలేని ముద్ర వేసిన ఎన్టీఆర్ వంటి మహానుభావులను కేవలం ఒక కులానికో, ప్రాంతానికో ముడిపెట్టి మాట్లాడటం బుద్ధిలేనితనమే అవుతుందని సీఎం తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ధర్నాలపై బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ధర్నాలకు నిజమైన రైతులు రావడం లేదని, కేవలం బీఆర్‌ఎస్ కార్యకర్తలే వస్తున్నారని బాల్క సుమన్ స్వయంగా చెప్పారని సీఎం పేర్కొన్నారు. దీన్ని బట్టి విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఇవి కూడా చదవండి
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..
వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..