మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో దారుణం.. చెరువులో శవమై కనిపించిన యువతి
ABN , Publish Date - Jul 18 , 2026 | 02:03 PM
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని దారుణం చోటుచేసుకుంది. శంకర్‌నగర్ సమీపంలోని చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది.
మేడ్చల్ జిల్లా: పీర్జాదిగూడలో ఓ యువతి మృతదేహం చెరువులో లభ్యమవడం కలకలం రేపింది. శంకర్‌నగర్ సమీపంలోని చెరువులో యువతి శవాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతురాలు ఎవరు? ఆమె ఎలా మృతి చెందింది? ప్రమాదవశాత్తూ చెరువులో పడిందా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read:
పాము సాయంతో భర్తను హత్య చేసిన భార్య..
చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. స్కైరూట్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని