Share News

పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్.. చివరికి..

ABN , Publish Date - Sep 10 , 2026 | 07:49 AM

పదేళ్లుగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చివరకు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడో కానిస్టేబుల్. తనను నమ్మించి మోసం చేశాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్.. చివరికి..
Hyderabad Constable Case

హైదరాబాద్, సెప్టెంబర్ 10: పదేళ్లుగా క్లాస్‌మేట్‌తో ప్రేమాయణం కొనసాగిస్తూ.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ కానిస్టేబుల్‌పై ఉప్పల్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కానిస్టేబుల్ అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. తనతో పదేళ్లుగా ప్రేమలో ఉన్న అరుణ్‌కుమార్.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, తనను నమ్మించాడని బాధితురాలు ఆరోపించింది. అయితే ఇటీవల అతడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. తనను పక్కనపెట్టి మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.


బాధితురాలి ఆరోపణల ప్రకారం.. జులై 1న అరుణ్‌కుమార్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇన్నాళ్లుగా తనతో ప్రేమ సంబంధం కొనసాగిస్తూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చివరకు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనను మోసం చేయడంతో పాటు మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉప్పల్ పోలీసులు అరుణ్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి..

స్థానిక పోరుకు సన్నద్ధం..!

వదలని ఏనుగులు

Updated Date - Sep 10 , 2026 | 10:36 AM