ప్రధాని మోదీ కార్యక్రమాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ABN , Publish Date - May 09 , 2026 | 09:11 PM
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారిక ఆహ్వానం అందింది.
హైదరాబాద్, మే 09: తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారిక ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ రహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రేపు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ (HICC) వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. దీనితో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు నిర్మించనున్న నాలుగు లేన్ల రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. రవాణా రంగంలో మరో ప్రధాన ఘట్టంగా కాజీపేట – విజయవాడ మధ్య చేపట్టనున్న మల్టీ ట్రాకింగ్ రైల్వే పనులకు కూడా ఈ వేదిక నుంచే శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి...
నాలుగేళ్ల బాలుడిని కాటేసిన రెండు విష సర్పాలు
సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ విడుదల
Read Latest Telangana News And Telugu News