Share News

'ప్యారడైజ్' సినిమా ప్రీమియర్‌ షోపై ఉత్కంఠ!

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:26 PM

నాని హీరోగా నటిస్తున్న 'ప్యారడైజ్' సినిమా ఈ రోజు రాత్రే ప్రీమియర్ షోలు వేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, వాటి అనుమతులను సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

'ప్యారడైజ్' సినిమా ప్రీమియర్‌ షోపై ఉత్కంఠ!
Paradise Movie Premiere Show: High Court to Hear Plea on September 24

హైదరాబాద్, సెప్టెంబర్ 23: నాని కథానాయకుడిగా నటిస్తున్న 'ప్యారడైజ్' సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్ షోల రగడ తెలంగాణ హైకోర్టుకు చేరింది. టికెట్ల ధరల పెంపు, అర్ధరాత్రి వేసే ప్రీమియర్ షోల అనుమతులపై దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ప్రీమియర్ షోపై లంచ్ మోషన్ పిటిషన్

ఈ రోజు రాత్రే 'ప్యారడైజ్' ప్రీమియర్ షోలు వేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, వాటి అనుమతులను సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణను రేపటికి (గురువారానికి) వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.

Paradise price hike.jpg


టికెట్ల ధరల మెమోపై హైకోర్టు ఆగ్రహం

నిన్నటి విచారణలోనే ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పెంచిన టికెట్ ధరల మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.

ఈ రాత్రి ప్రీమియర్‌పై ఉత్కంఠ

ఒకవైపు ఈ రాత్రికే 'ప్యారడైజ్' ప్రత్యేక ప్రీమియర్ షోలకు ప్రదర్శకులు ఏర్పాట్లు పూర్తి చేసుకోగా, మరోవైపు ప్రీమియర్ షో పిటిషన్‌ను రేపే వింటామని హైకోర్టు చెప్పడంతో ఈ షోల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 23 , 2026 | 05:41 PM