Share News

ఓంకారేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కమిటీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:35 AM

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో చేపట్టే ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, అభివృద్ధి పనుల్లో సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది.

ఓంకారేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కమిటీ

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో చేపట్టే ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, అభివృద్ధి పనుల్లో సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ విజ్ఞప్తి మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీలో రహదారులు భవనాల శాఖ చీఫ్‌ ఇంజినీరు చైర్మన్‌గా, ప్రజారోగ్య శాఖ చీఫ్‌ ఇంజినీరు కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎంఆర్‌డీసీఎల్‌ చీఫ్‌ ఇంజినీరు కన్వీనర్‌గా ఉంటారు. కమిటీలో దేవాదాయ శాఖ చీఫ్‌ ఇంజినీరు, ఆలయ నిర్మాణ నిపుణులు డా.ఈ.శివనాగిరెడ్డి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

ఈ వార్తలనూ చదవండి:

హైడ్రా బూచిగా అక్రమ వసూళ్లు

జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!

Updated Date - Oct 09 , 2026 | 06:45 AM