Share News

బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌కు చైర్‌పర్సన్‌ను నియమించాలి: ఎఫ్‌జీజీ

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:30 AM

అనధికార నిర్మాణాల కేసులను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ‘బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌’కు చైర్‌పర్సన్‌, సభ్యులను తక్షణమే నియమించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) డిమాండ్‌ చేసింది.

బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌కు చైర్‌పర్సన్‌ను నియమించాలి: ఎఫ్‌జీజీ

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): అనధికార నిర్మాణాల కేసులను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ‘బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌’కు చైర్‌పర్సన్‌, సభ్యులను తక్షణమే నియమించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) డిమాండ్‌ చేసింది. ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. అక్రమ నిర్మాణాలకు మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేసిన ప్రతిసారి బిల్డర్లు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారని వివరించారు. అనధికార నిర్మాణాల కేసులను ప్రారంభ దశలోనే పరిష్కరించడానికి ప్రభుత్వం 2016లో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. దీనికి ఇప్పటివరకు చైర్‌పర్సన్‌, సభ్యులను నియమించలేదని, ఇప్పటికైనా ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Updated Date - Aug 26 , 2026 | 05:34 AM