Share News

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Nov 12 , 2026 | 09:04 PM

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కంజర్ సమీపంలో గడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో కోటగల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Nizamabad Road Accident

నిజామాబాద్, నవంబర్ 12: జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంజర్ సమీపంలో గడ్డి తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో నగరంలోని కోటగల్లికి చెందిన మనోజ్ (46), రాజు (36) ప్రాణాలు కోల్పోయారు. కులాస్‌పూర్‌లో జరిగిన విందు కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. మార్గమధ్యంలో గడ్డి తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.


ఈ ప్రమాద వార్త తెలియడంతో కోటగల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనోజ్‌కు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉండగా, రాజుకు భార్యతో పాటు కేవలం నెల రోజుల వయస్సున్న చిన్నారి కొడుకు ఉన్నాడు. కుటుంబాలకు అండగా ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నెల రోజుల పసికందు తండ్రిని కోల్పోవడం స్థానికులను కలచివేసింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నెలకొనగా, కోటగల్లిలో విషాద వాతావరణం ఏర్పడింది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 09:15 PM